మనోధైర్యంతో ఉండండి..!
– ఉద్యమకారుడికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాళి
– సంగమేశ్వర్ కుటుంబానికి పరామర్శ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎలాంటీ వేధనకు గురికాకుండా మనోధైర్యంతో ఉండాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మైలారం సంగమేశ్వర్ మృతిపట్ల ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. సోమవారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సంగమేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించారు.
ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పలకరించి పరామర్శించారు. సంగమేశ్వర్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంగా ఉండాలని భరోసా అందించారు. ఎమ్మెల్సీ వెంట కాంగ్రెస్ నాయకులు లింగదలి రవికుమార్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, కౌన్సిలర్ ప్రవీణ్ గౌడ్, యువనాయకులు బిడ్కర్ రఘు, భగవాన్, సిద్దు తదితరులు ఉన్నారు.


ఇదికూడా చదవండి…

