భళా.. బాల మేధావులు..!
– ఆకట్టుకున్న చిన్నారుల ప్రతిభ
– న్యూనలంద స్కూల్‌లో సైన్స్ ఫేయిర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని న్యూ నలంద స్కూల్ విద్యార్థులు భళా అనిపించారు. బుధవారం స్కూళ్లో సైన్స్ ఫేయిర్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులు వారు తయారు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వారం రోజులుగా ఇంటి వద్ద పోటీపడి నువ్వా.. నేనా అన్నట్లుగా వివిధ రకాల గణిత మెళకువలు, సూత్రాలు తయారు చేశారు. ఆరోతరగతి భవ్యశ్రీ కంప్యూటర్ విడి భాగాలు తయారు చేయగా, మూడోతరగతి చదువుతున్న విరాట్ ప్లేస్ వ్యాలూవ్ వంటి సైన్స్ ఫేయిర్ నిర్వహించారు.

అదేవిధంగా పలువురు విద్యార్థుల ప్రదర్శనలు కూడా ఆకట్టుకున్నాయి. బాల మేధస్సుతో తయారు చేసిన సృజనాత్మక ప్రదర్శనలతో భళా అని అనిపించుకున్నారు. విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

