సాంకేతిక శిక్షణతో యువతకు మేలు..!
– తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
– ఉదయన్ కేర్ కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కంప్యూటర్ సాంకేతిక శిక్షణతో యువతకు ఎంతో మేలు జరుగుతుందని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం పీపుల్స్ డీగ్రీ కాలేజీలో గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయన్ కేర్ ఐటీ సెంటర్, మైక్రో సాఫ్ట్ సహాకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ ఉమా హారతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సాంకేతిక రంగంలో యువతకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు గ్లోబల్ యువతరం, ఉదయన్ కేర్ ఐటీ సెంటర్ ముందుకు రావడం అభినందనీయం అని అన్నారు. ఇలాంటి ఉపాధి శిక్షణ వల్ల యువతకు మేలు జరుగుతుందన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని అభిలాషించారు. యువత కూడా సాంకేతిక నైపుణ్య అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉదయన్ కేర్ సెంటర్ న్యూఢిల్లీ హెడ్ అరుణ్ గుప్త, రీజీనల్ హెడ్ శ్రీంకల, రీజీనల్ కోఆర్డినేటర్ అశ్విన్ కుమార్, పీపుల్స్ కాలేజీ సెక్రటరీ ఉత్తమ్ చంద్, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్, గ్లోబల్ యువతరం ఫౌండర్, ప్రెసిడెంట్ మంబాపురం విజయేందర్, జనరల్ సెక్రటరీ అరుణ్ రాజ్, బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, టీజీఎల్డీ జిల్లా అధ్యక్షులు మహేందర్, కళాశాల ప్రిన్సిపల్ చంద్రకళ, సెంటర్ నిర్వహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి….

