సీఎం కప్ పోటీలకు వేళాయే..!
– ఈనెల 17 నుంచి పోటీలు
– గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో నిర్వహణ
– ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో సీఎం కప్ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కప్ 2025-26 లో భాగంగా జిల్లాలో గ్రామ, మండల, అసెంబ్లీ, జిల్లాస్థాయిలో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన క్రీడల అధికారి సత్తార్ తెలిపారు.

జనవరి 17 నుంచి 22 వరకు గ్రామపంచాయతీ స్థాయిలో అథ్లెటిక్స్, కబడ్డీ , కోకో, వాలీబాల్, యోగ పోటీలు జరుగుతాయని తెలిపారు. 28 నుండి 31వరకు మండల స్థాయిలో అథ్లెటిక్స్, ఫుట్బాల్ ,కబడ్డీ కోకో, వాలీబాల్ యోగ పోటీలు జరుగుతాయన్నారు. వచ్చేనెల ఫిబ్రవరి 3 నుంచి 7వ తేది వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, చెస్ సైక్లింగ్, ఫుట్‌బాల్, హ్యాండ్ బాల్, కబడ్డీ, కోకో, వాలీబాల్ యోగ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఫిబ్రవరి 10 నుండి 14 వరకు ఆర్చరీ, అథ్లెటిక్స్,అత్యపత్య, బ్యాట్మెంటన్, బేస్ బాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్, చెస్, సైక్లింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, కోకో, కిక్ బాక్సింగ్, నెట్ బాల్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, వాలీబాల్, రెజ్లింగ్ లతో తో పాటు యోగ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆసక్తి గల యువతి, యువకులు http://satg.telangana.gov.in/cmcup/signup. ఆన్లైన్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందిగా ఆయన తెలిపారు.

ఇదికూడా చదవండి…

