ఎమ్మెల్యే జోలికి రావొద్దు..!
– ప్రోటోకాల్‌తోనే చెక్కుల పంపిణీ
– తహసీల్దార్‌తో లావాదేవిలెవరివో అందరికి తెలుసు
– పెద్దేముల్ టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: రాజకీయాల విమర్శల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి జోలికి రావొద్దని టీఆర్ఎస్ పెద్దేముల్ మండల అధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పెద్దేముల్ మండలంలో కళ్యాణ లక్ష్మీ, షాదీముభారక్ చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ జెడ్పీటీసీ ధారాసింగ్, నాయకులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై చేసిన విమర్శలను ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఖండించారు. ప్రోటోకాల్ ప్రకారమే ప్రజా ప్రతినిధులు సమక్షంలో చెక్కుల పంపిణీ జరిగిందని చెప్పుకొచ్చారు. విషయం ఏదైనా ఉంటే సూటిగా మాట్లాడాలన్నారు. తహసీల్దార్ విషయాన్ని ఎమ్మెల్యేకు జోడిస్తూ విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. తహాసీల్దార్‌తో ఎవరెవరు లావాదేవీలు జరుపుకుంటున్నారో అందరికి తెలుసన్నారు. జెడ్పీటీసీ గ్రామాల అభివృద్ధిలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధి కోసం ఎక్కడా సమావేశాలు నిర్వహించడం, సమస్యలు పరిష్కరించడం వంటి దాఖాలాలేవి లేవని విమర్శించారు. ఇప్పటికైనా స్వార్ధ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. లేదంటే పరిణామాలు వేరే విధంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పరిషత్ వైస్ చైర్మన్ గోపాల్ రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షులు కృష్ణ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రంగయ్య, మాజీ సర్పంచ్ రవి నాయక్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు డివై. ప్రసాద్ బాబు, టీఆర్ఎస్ పార్టీ నేతలు వెంకట్ రెడ్డి, శుబ్లీ, ఉపేందర్ తదితరులు ఉన్నారు.

