సైన్స్ ఫేయిర్లో అదరగొట్టిన కేవీసీఎస్

కెరీర్ క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

సైన్స్ ఫేయిర్లో అదరగొట్టిన కేవీసీఎస్
– పాఠశాల విద్యార్థినికి జిల్లా స్థాయి ఫస్ట్ ప్రైజ్
– అభినందించిన ప్రిన్సిపల్, యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫేయిర్లో తాండూరుకు చెందిన కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ (కేవీసీఎస్) విద్యార్థిని మనస్వీ ఆదరగొట్టింది.
kvcs
అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి జిల్లా స్థాయి మొదటి బహుమతిని సాధించింది. మంగళవారం పరిగిలో వికారాబాద్ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని కె.మనస్వీ పైటో మైనింగ్- మెటల్ ప్లాంట్స్ ప్రదర్శన ఇచ్చింది. ఈ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. దీంతో మనస్వీ ప్రదర్శనకు జిల్లా స్థాయి మొదటి బహుమతిని ప్రకటించారు. దీంతో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర పోటీలకు ఎంపికచేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, చేతుల మీదుగా మనస్వీకి ప్రశంస పత్రం, బహుమతి అందించారు. ఈసందర్భంగా కేవీసీఎస్ ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్, యజమాన్యం విద్యార్థిని మనస్వితో పాటు టీచర్ పద్మశ్రీలను అభినందించారు. పాఠశాల కీర్తి ప్రతిష్ఠలను పెంచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో కూడా ప్రతిభను చాటి జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఇదికూడా చదవండి…

సైన్స్ ఫేయిర్లో ‘టాలెంట్’ అదుర్స్..!