ఘనంగా ప్రపంచం ఫోటోగ్రఫీ దినోత్సవం
– ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్రేకు నివాళులు
– ఆసుపత్రిలో రోగులకు అల్పహారం, పండ్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ప్రపంచ ఫోటొగ్రఫీ దినోత్సవంను ఫోటో గ్రాఫర్లు ఘనంగా జరుపుకున్నారు. శనివారం తాండూరు నియోజకవర్గ ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రితో పాటు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయా ఆసుపత్రిలలోని రోగులకు, వారి బందువులకు అల్పాహారంతో పాటు పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, ఉపాధ్యక్షులు షాబుద్దీన్, సహాయ కార్యదర్శి దివ్య రాము, సీనియర్ ఫోటోగ్రాఫర్లు శరణు, వెంకటేశం, గోపాల్, అంబదాస్,ఓంకార్ శివ, అనిల్ మల్లికార్జున్, వేమరెడ్డి పలువులు ఫోటోగ్రాఫర్ లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

