తేలిన బల్దియా ఓటర్లు లెక్క..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తేలిన బల్దియా ఓటర్లు లెక్క..!
– ఫోటోలతో మహిళలు, పురుషుల వివరాలు ప్రదర్శన
– వార్డుల వారిగా ప్రకటించిన అధికారులు
– మార్పులు, చెర్పులు లేకుండానే ప్రకటన
– తుది జాబితాలో ఓటర్లు ఎంతమందంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ లో తుదిజాబితాలో ఓటర్ల లెక్క తేలింది. పట్టణానికి సంబంధించి మొత్తం 77 వేల 29 మంది ఉన్నట్లు ఫైనల్ జాబితాలో ప్రకటించారు.

వార్డుల వారిగా మహిళలు, పురుషులు, ఇతరులకు సంబంధించిన వివరాలను వార్డుల వారిగా ప్రకటించారు. గతంలో చెప్పిన మాదిరిగానే ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండానే అధికారులు తుదిజాబితాను ప్రకటించారు.

కేవలం ప్లాట్ల నెంబర్లతో మాత్రమే నమోదు కాబడిన ఓటర్లను తొలగించి.. చనిపోయిన వారి వివరాలను తొలగించకుండా జాబితాను ప్రకటించారు. మొత్తానికి మహిళలు 39525, పురుషులు 37499, ఇతరులు 5 మంది ఉన్నట్లుగా చూపించారు.

వార్డుల వారిగా ఓటర్ల వివరాలు


ఇదికూడా చదవండి…

పోలింగ్ కేంద్రాలపై ఫోకస్..!