టీజర్, సినిమా రెండూ చూపిస్తా..!
– నీ అక్రమాల చిట్టా విప్పితే.. తాండూరులో కనిపించవ్
– కుటుంబంలో చిచ్చు పెడితే ఊరుకునేది లేదు.
– కాంగ్రెస్ పార్టీకి చేసిన దోహ్రానికి రాళ్లదెబ్బలే
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై ఫైర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి రానున్న రోజుల్లో టీజర్, సినిమా రెండూ చూపిస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ద్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తనపై చేసిన విమర్శలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఖండించారు.

సోమవారం పట్టణంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారుల విజయాలు బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యేకు చెంపపెట్లుగా మారిన సిగ్గులేకుండా పోయిందన్నారు. పంచాయతీ ఎన్నికల విజయాలపై తప్పుడు లెక్కలు చూపిస్తే.. డీసీసీ అధ్యక్షులు విసిరిన సవాల్ కు ఇప్పటి వరకు స్పందించే దమ్ము లేకుండా పోయిందని అన్నారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి వద్ద పనిచేసిన పైలెట్ రోహిత్ రెడ్డి ద్రోహం గురించి మాట్లాడితే దెయ్యం వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

తాను 30 ఏండ్లుగా రాజకీయాల్లో అందించిన సేవలకు నేడు ఎమ్మెల్యేగా పదవిలో ఉన్నానని చెప్పుకొచ్చారు. తమ్ముడు బిక్ష అంటూ మా కుటుంబంలో చిచ్చు పెట్టే రాజకీయాలు మానుకోవాలని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ప్రభుత్వ భూముల అక్రమణ, అక్రమ వసూళ్లు వంటి అక్రమాల చిట్టా విప్పితే తాండూరులో కనిపించకుండా పోతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిన రోహిత్ రెడ్డి చరిత్రను చెబితే ప్రజలే రాళ్లదెబ్బలు వేస్తారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు మానుకోకపోతే మీ.. వెంబడి పడి గుట్టు విప్పుతామని హెచ్చరించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చైర్మన్ను కూర్చోబెట్టి రోహిత్ రెడ్డికి, బీఆర్ఎస్ పార్టీకి టీజర్, సినిమా రెండూ చూపిస్తామని అన్నారు.

ఇదికూడా చదవండి…

