దార్శనీకుడు డా.బిఆర్. అంబేద్కర్
– తాండూరులో ఘన నివాళులు అర్పించిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారత రాజ్యాంగంలో బడుగు బలహీనవర్గాల అభ్యున్నతనికి హక్కులు కల్పించిన డా.బీఆర్. అంబేద్కర్ అందరికి దార్శనీకుడుగా నిలిచారని తాండూరు టీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. సోమవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ గారి 65 వ వర్దంతి సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) ఆధ్వర్యంలో తాండూరు పట్టంలోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్-చైర్ పర్సన్ శ్రీమతి. పట్లోళ్ల దీప నర్సింలు, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, టీఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, కౌన్సిలర్లు, నాయకులు, కోఆప్షన్ సభ్యులు పెద్ద ఎత్తున వర్దంతిలో పాల్గొని నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ అంబేద్కర్ ఒక కులానికో..ఒక వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదని, అందరివాడని అభివర్ణించారు. అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలతో ముందుకు సాగుతూ ఆయన రచించిన రాజ్యాంగాన్ని అందరం గౌరవిస్తూముందు తరాలకూ ఆ ఫలాలను అందిద్దామని పిలుపునిచ్చారు. అందరు ఐక్యమత్యంతో తాండూరులో అంబెడ్కర్ భావన నిర్మాణానికి కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనీయర్ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి, అబ్దుల్ రజాక్, నాయకులు సాయిపూర్ బాల్రెడ్డి, మసూద్, న్యాయవాది గోపాల్, ఉర్దూఘర్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మాజీ చైర్మన్ అబ్దుల్ సలీం, కౌన్సిలర్ ముక్తార్ నాజ్, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, బిర్కడ్ ఉశ, నాయకులు దత్తు, సంజీవరావు, టైలర్ రమేష్, రిజ్వాన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

