గాంధీన‌గ‌ర్‌లో సెంచ‌రీ టీకాలు

తాండూరు వికారాబాద్

గాంధీన‌గ‌ర్‌లో సెంచ‌రీ టీకాలు
– ధ‌న్య‌వాదాలు తెలిపిన కౌన్సిల‌ర్ సంగీత ఠాకూర్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ ప‌రిధిలోని గాంధీన‌గర్‌లో సెంచ‌రీ క‌రోనా వ్యాక్సీనేష‌న్ టీకాలు పూర్త‌య్యాయ‌ని వార్డు బీజేపీ కౌన్సిల‌ర్ సంగీత అజ‌య్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. శుక్ర‌వారంతో వార్డులో కొన‌సాగుతున్న ఇంటింటికి వ్యాక్సీనేష‌న్ స్పెష‌ల్ డ్రైవ్ ద్వారా మొత్తం 104 మంది టీకాలు వేయించుకున్నార‌ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ

దేశ ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి ఉచితంగా వ్యాక్సీనేషన్‌ను అందిస్తున్నార‌ని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌లంద‌రు వ్యాక్సీనేష‌న్ వేసుకోవాల‌నే ఉద్దేశంతో ఇంటింటికి వ్యాక్సీనేష‌న్ స్పెష‌ల్ డ్రైవ్‌ను ప్రారంభించడం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఇందుకు ప్ర‌జ‌లు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడికి రుణ‌ప‌డి ఉండాల‌న్నారు. అదేవిధంగా వార్డులో వ్యాక్సీనేష‌న్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తున్న ఎఎన్ఎం అనిత, ఆశ వర్కర్ సుజాత, ఆర్పీశోభ, అంగ‌న్‌వాడీ టీచర్ స్వరూప, స్పెషల్ ఆఫీసర్ మహేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.