తాళం వేసిన ఇంట్లో చోరీ..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

తాళం వేసిన ఇంట్లో చోరీ..!
– బంగారం, వెండి ఆపహరణ
– బీరువాలో దాచిన నగదు మాయం
– తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరికి పాల్పడ్డారు. ఇంట్లో దాచిన బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన సోమవారం తాండూరు పట్టణంలో కలవరం రేపింది.

స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సాయిపూర్ ప్రాంతానికి చెందిన సిద్రామేశ్వర్ కుటుంబం తాతగుడి సమీపంలో నివసిస్తోంది. సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి పనుల మీద బయటకు వెళ్లారు. సిద్రామేశ్వర్ భార్య ప్రవేటు స్కూల్లో పనిచేస్తుండగా సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది.

అప్పటికే ఇంటి తాళం పగులగొట్టి ఉండడం.. ఇంట్లో వస్తువులు, బీరువా చిందర వందరగా ఉండడంతో ఆందోళనకు గురయ్యింది. వెంటనే ఇంట్లో అర్థతులం బంగారం, 20తులాల వెండి, రూ.30వేల నగదు చోరికి గురైనట్లు గుర్తించింది. విషయం పోలీసులకు తెలియడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.

ఇదికూడా చదవండి…

తాండూరులో 3 నామినేషన్ల విత్ డ్రా..!