తాండూరుకు రాజయోగం రాబోతోంది..!
– వందల కోట్లతో అండర్ డ్రైనేజీ కట్టిస్తాం
– వికారాబాద్, హైదరాబాద్ రోడ్డుకు నిధుల వరధ
– పరిగి సభలో సీఎం రేవంత్ రెడ్డి వరాలు
– బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందంపై కీలక వాఖ్యలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గానికి రాజయోగం కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లాలోని పరిగిలో ప్రజాపాలన – ప్రగతి బాట సభ జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు సమస్యలను తీసుకెళ్లారు.

ఇందుకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో ప్రసంగిస్తూ తాండూరుకు వరాలు ప్రకటించారు. సుమారు రూ. 500ల కోట్లతో తాండూరులో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని అన్నారు. అదేవిధంగా కాగ్నానది నుంచి తాండూరు పట్టణ వాసులకు తాగునీరు సరఫరా జరిగేలా పైపులైన్ వ్యవస్థను పురోగతికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఇప్పటికే మన్నెగూడ తాండూరు రోడ్డు పనులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. వికారాబాద్ – హైదరాబాద్ రోడ్డు పూర్తి చేసేందుకు ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాలపై కీలక వాఖ్యలు చేశారు.

తాండూరులో బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలను అరువు తెచ్చుకుంటున్నారని అన్నారు. బీజేపీ నేతలకు బీఆర్ఎస్ పార్టీ నుంచీ బీఫారాలు అందిస్తున్నారని తెలిసిందని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒక్కటై సాగుతున్నారని, పైకి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవస్తామని, మంజూరు చేస్తూ రాజయోగం కల్పిస్తామని.. కావాలంటే రాసుకోండి అని పేర్కొన్నారు. మరోవైపు పరిగిలో జరిగిన సభకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లి సభ విజయవంతం చేయడంలో భాగస్వాములు అయ్యారు.

ఇదికూడా చదవండి…

