ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా..!
– కాంగ్రెస్ పార్టీతోనే సమగ్ర అభివృద్ధి
– 36వ వార్డు అభ్యర్థి కల్వ సిరిచందన
తాండూరు, దర్శిని ప్రతినిధి: మునిసిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా ఆశీర్వదిస్తే పట్టణంలోని 36వ వార్డును అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కల్వ సిరి చందన అన్నారు.
ఎన్నికల్లో భాగంగా వార్డులో పార్టీ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 36వ వార్డు అభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని తెలిపారు. కౌన్సిలర్ గా ఆదరిస్తే ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ని ధులు సాధించి పనులు చేపట్టి.. 36వ వార్డు సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. మరవకుండా ఎన్నికల రోజు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, యువ నాయకులు యువకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి

