నకిలీ ఓటుపై.. చాలెంజ్..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

నకిలీ ఓటుపై.. చాలెంజ్..!
– బోగస్‌ వేయనీయకుండా అపే అవకాశం
– ఎన్నికల నిబంధనలు ఏం చెబుతున్నాయంటే
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంకొన్ని గంటల్లో తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాల్టీలలో ఎన్నికల పోలింగ్ మొదలుకానుంది. ఎన్నికల సమయాలలో చాలెంజ్ ఓటు రూలు వినిపిస్తూ ఉంటుంది. దీని గురించి చాల మందికి తెలియకపోవచ్చు.

ఎన్నికల సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేయకుండా.. అడ్డుకునేందుకు పెట్టిన నిబంధనే చాలెంజ్ ఓటు. పోలింగ్ కేంద్రాలలో నకిలీ వ్యక్తులు ఓటు వేయకుండా అడ్డుకోవడంతో పాటు అసలైన ఓటరుకు జాబితాలో పేరు లేకపోతే గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు చూపించి సెక్షన్‌ 49ఏ కింద ఛాలెంజ్‌ ఓటును వినియోగించుకోవచ్చు. పోలింగ్‌ బూత్‌లోకి వచ్చిన వ్యక్తి ఓటరు జాబితాలో ఉన్న పేరుకు సరిపడక అనుమానం కలిగితే ఏజెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారికి రూ.5 చెల్లించి సవాలు చేయడానికి అవకాశం ఉంటుంది.

వయసు, తండ్రి పేరు, అతడి గుర్తింపు కార్డును పరిగణనలోకి తీసుకుని బంధువులు లేదంటే అతడి ఇంటి దగ్గర్లోని వారి సాక్ష్యంగా, వారితో ప్రమాణం చేయించి విచారణ చేపడతారు. బోగస్‌ అని తేలితే అతడిపై ఫిర్యాదు చేసి పోలీసులకు అప్పగిస్తారు. వాస్తవమని తేలితే అనుమతి ఇచ్చి, సవాలు చేసిన ఏజెంట్‌ ఓడిపోయినట్లు తీర్మానించి అతను చెల్లించిన రూ.2 ను ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఒక వేళ ఏజెంట్‌ తన సవాలులో గెలిస్తే రూ.2ను పీఓ తిరిగి ఏజెంట్‌కు ఇచ్చేస్తారు. అసలు ఈ చాలెంజింగ్ ఓటు అంటే ఏమిటి, ఈ ఓటును ఎవరు వేస్తారు, ఏ సందర్భంలో వేస్తారో తెలుసుకోవాల్సిన అవసరం అందరికి ఉంది.

ఏదైన గుర్తింపు కార్డు చూపి ఓటేయొచ్చు
ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేటపుడు ఓటరు గుర్తింపు కార్డు లేని పక్షంలో ఇతర 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని చూపి ఓటు వేయవచ్చని అధికారులు ప్రకటించారు. అందులో కొన్ని…
1) ఆధార్ కార్డు
2) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు
3) ఫోటోతో కూడిన పోస్ట్ ఆఫీస్/ బ్యాంక్ పాస్ బుక్
4) కార్మిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
5) డ్రైవింగ్ లైసెన్స్
6) పాన్ కార్డ్
7) ఫోటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధృవీకరణ పత్రాలు
8) ఇండియన్ పాస్పోర్ట్
9) ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్
10) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే… గుర్తించ పడిన కార్డులు

ఇదికూడా చదవండి…

కరాటే పోటీల్లో తాండూరు క్రీడాకారుల సత్తా..!