పైలెట్ ఇంట.. రామన్న సందడి..!
– కుటుంబంతో కేటీఆర్ ఆప్యాయ పలకరింపు
– కూతురు, కుమారుడిని విష్ చేసిన కేటీఆర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందడి చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ తాండూరుకు వచ్చారు.

ప్రత్యేక విమానంలో వచ్చిన కేటీఆర్‌ను మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలుతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. కేటీఆర్‌ను రోహిత్ రెడ్డి తన నివాసానికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ను రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి, తల్లి, వికారాబాద్ మాజీ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, సతీమణి ఆర్తిరెడ్డి, కూతురు, కుమారుడు అప్యాయంగా పలకరించారు. కేటీఆర్ రోహిత్ రెడ్డి కూతురు, కుమారుడులను హ్యాపిగా విషెష్ చేశారు. అనంతరం కేటీఆర్ రోహిత్ రెడ్డి తల్లిదండ్రులను, సతీమణి, కుటుంబ సభ్యులను పలకరించారు. తన నివాసానికి వచ్చిన కేటీఆర్‌కు రోహిత్ రెడ్డి తేనీటి విందును ఇచ్చారు. దీంతో రోహిత్ రెడ్డి నివాసంలో కేటీఆర్ సందడి కనిపించింది.

ఇదికూడా చదవండి…

