సంజీవరావును పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభారాణి భర్త బొబ్బిలి సంజీవరావును ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఇటీవలే అనారోగ్యానికి గురైన సంజీవరావు హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అపోలో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న సంజీవరావును పలకరించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇలాంటి పరిస్థితుల్లో కుంగిపోవద్దని, ధైర్యంగా ఉండాలని మనోధైర్యం నింపారు. అనంతరం ఆసుపత్రి వైద్యులను సంప్రదించి సంజీవరావుకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ శోభరాణి, కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఈ వార్తను సమర్పించిన వారు

