హస్తం అభ్యర్థుల గెలుపుకు అండగా బీఎస్ఆర్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హస్తం అభ్యర్థుల గెలుపుకు అండగా బీఎస్ఆర్..!
– ప్రచారంలో కదం తొక్కుతూ ముందుకు
– ఓటు మీ వంతు.. అభివృద్ధి మా వంతు అంటూ భరోసా
– బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రచారానికి జనాధారణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఆ పార్టీ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి జనంలోకి కదిలారు. పట్టణంలోని అన్ని వార్డులలో నిర్వహిస్తున్న ప్రచారంలో కదంతొక్కుతూ ముందుకు సాగుతున్నారు.

తాజాగా ఆదివారం పట్టణంలోని 13, 21, 22 వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు జాదవ్ రాములు, సభా ఫాతిమా, మున్నపురం రాముల తరుపున ప్రచారంలో పాల్గొన్నారు. ఆయా వార్డులలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమని అన్నారు. మున్సిపల్‌లో కాంగ్రెస్ చైర్ పర్సన్‌ అయితే అన్ని వార్డులు పార్టీలకతీతంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపుకోసం చేతి గుర్తుకు ఓటు వేసే బాధ్యత మీది.. అభివృద్ధి చేసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీదే అని ప్రజలను చైతన్య పరిచారు. బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రచారానికి మంచి జనాధారణ కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కాంగ్రెస్ పార్టీని ఆదరించండి..!