ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీదే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీదే..!
– అన్ని స్థానాలలో క్లీన్ స్వీప్ పక్కా
– తెలంగాణ చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి 
– తాండూరులో ఓటు హక్కు వినియోగం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాల్టీలు అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పక్కా అని తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం తాండూరు పట్టణం 28వ వార్డులోని పోలింగ్ కేంద్రంలో చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి, ఆయన కుమారుడు యువనేత పట్నం రినీష్‌ రెడ్డితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 9 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పాలనే తమ అభ్యర్థులను గెలిపిస్తాయని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఆసరా పెన్షన్ల క్రమబద్ధీకరణ వంటి అంశాలు కలిసోస్తాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పర్యటనల్లో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. తాండూరు మున్సిపల్‌లో కూడా అత్యధిక స్థానాలను దక్కించుకుని చైర్మన్ పీఠంను కాంగ్రెస్ అభ్యర్థే అధిరోహించడం ఖాయమన్నారు. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలలో చైర్మన్ అభ్యర్థిని ప్రకటించడం జరిగిందని మహేందర్ రెడ్డి వివరించారు. ఆయన వెంట టీపీసీసీ ప్రచార కమిటీ సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, అబ్దుల్ రవూఫ్‌ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

మున్సిపల్ లో 36 స్థానాలు మావే..!