మున్సిపల్ లో 36 స్థానాలు మావే..!
– అభివృద్ధి కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– 12 వ వార్డులో కుటుంబంతో కలిసి ఓటు వేసిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 36 వార్డులు గెలవబోతున్నామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.
మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బుధవారం 12వ వార్డులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. అభివృద్ధి కోసం అందురు ఓటు వేయాలని అన్నారు.

అదేవిధంగా ఎన్నికల్లో మున్సిపల్ లోని 36వార్డులో అన్ని వార్డులను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఫస్ట్ ఉమెన్ విషయంపై స్పందిస్తూ తినబోతూ రుచులు ఎందుకని బదులిస్తూ దాటవేశారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, మాజీ కౌన్సిలర్ నీరజా రెడ్డి, పార్టీ నాయకులు సర్దార్ ఖాన్, కొమ్ము గోపాల్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి, నేతలు తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..

