మున్సిపల్ చైర్ పర్సన్‌కు ఘన సన్మానం
– పట్లోళ్ల దంపతులను సత్కరించిన శంకరన్న
– శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఆదివారం తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది.

శంకర్ యాదవ్, చంద్రకళ దంపతులు మున్సిపల్ చైర్ పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి దంపతులను గజమాలతో సత్కరించారు. వారికి శాలువాలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా శంకర్ యాదవ్ మిత్రబృందం బీసీ సంఘం నాయకులు కందుకూరి రాజ్ కుమార్, నాయకులు బంటు మల్లప్ప, మనోహర్ యాదవ్, జొన్నల వినోద్, ప్రేమ్ రాజ్, చైతన్య కాలేజీ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి తదితరులు కూడా చైర్ పర్సన్ నీరజా, బాల్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు.


