కల్లు కోసం లోల్లి..!
– రేట్లు తగ్గించాలని రోడ్డుపై దర్నా
– చివరికి ఎం జరిగిందంటే…?
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎవరైనా న్యాయం చేయాలని, సమస్యలు పరిష్కరించాలని దర్నాలు, రాస్తా రోకోలు చేస్తారు. ఆఖరుకు నిత్యవసర ధరలు తగ్గించాలని ఆందోళన చేస్తారు. అయితే తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో కల్లు కోసం లొల్లి చేశారు. ఈ వేరైటీ సంఘటన ఆదివారం జరిగింది.

పెద్దేముల్ మండల కేంద్రంలో కల్లు రేట్లు తగ్గించాలని దర్నా చేశారు. రోడ్డుపై బైటాయించి నినాదాలు చేశారు. ఒక సీసా కల్లు రూ.15 లకు కల్లు అమ్మడంతో గ్రామస్తులు 10 రూపాయలకే అమ్మాలని కల్లు దుకాణ దారులకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు వ్యాపారులు 10 రూపాయలకు కల్లు విక్రయిస్తే గిట్టుబాటు కాదని, వ్యతిరేకించారు.

దీంతో వ్యాపారులు దుకాణాలను రెండు రోజుల నుంచి మూసివేశారు. వ్యాపారులు దిగిరాకపోవడంతో గ్రామస్తులు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఎన్నికల కోడ్ ఉంది. మీరు రోడ్డు మీద బైఠాయించి రాస్తారోకో నిర్వహిస్తే కేసులు పెడతామని చెప్పడంతో గ్రామస్తులు అక్కడినుండి వెళ్ళిపోయారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఇదికూడా చదవండి…

