మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావుతో పట్లోళ్ల నర్సింలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావుతో పట్లోళ్ల నర్సింలు..!
– మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డీపీసీ సభ్యులు
– తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్‌ పదవికి గ్రీన్ సిగ్నల్
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలకు కృతజ్ఞతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావును తాండూరుకు చెందిన మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు కలిశారు. సోమవారం మంత్రి తుమ్మలను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్‌గా పట్లోళ్ల నర్సింలు నియామకంకు గ్రీన్‌ సిగ్నల్ లభించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావును పట్లోళ్ల నర్సింలు కలిసినట్లు తెలిసింది. మంత్రిని కలిసిన పట్లోళ్ల నర్సింలు ఆయనకు ధన్యవదాలు తెలిపారు.

అదేవిధంగా తనకు మార్కెట్ కమిటి పదవికి ఎంపిక చేస్తున్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సోదరులతో పాటు పార్టీ నేతల సహాయ సహాకారాలతో అభివృద్ధికి కృషి చేస్తానని నర్సింలు తెలిపారు. రేపో.. ఎల్లుండో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీకి అదరం.. బెదరం..!