వ్యాపారులకు మున్సిపల్ అధికారుల షాక్
– ఆరు బయట చెత్త వేసినందుకు భారీగా జరిమానలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధిలో వ్యాపారులకు అధికారులు షాక్ ఇస్తున్నారు. ప్రధాన రోడ్ల ముందు, దుకాణాల ముందు ఆరు బయట చెత్త వేయడం పట్ల భారీగా జరిమానాలు విధిస్తున్నారు. శనివారం తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ మేనేజర్ బుచ్చిబాబు ఆధ్వర్యంలో సిబ్బంది దుకాణాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా బస్టాండ్ తదితర ప్రాంతాలలో చెత్త సేకరణను పరిశీలించారు. అయితే బస్టాండ్ సమీపంలోని ఫాస్ట్ ఫుడ్, హోటల్ తదితర వ్యాపారులు చెత్త డబ్బాలు వినియోగించకుండా చెత్తను రోడ్లపై వేయడంతో ఆయా దుకాణాల దారులకు జరిమానలు విధించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వ్యాపారులు, ప్రజలు రోడ్లపై గాని, ఆరు బయటి ప్రాంతాలలో చెత్త వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాల్మెంట్ ఇంజనీర్ ప్రవీన్, మున్సిపల్ జవాన్లు సిహెచ్ అశోక్, బొట్టు శ్రీనివాస్, బాలు తదితరులు ఉన్నారు.


