అంగన్‌వాడి చిన్నారులతో ఆనందం..!
– ఘనంగా పరిమళ జన్మదిన వేడుకలు
– శుభాకాంక్షలు తెలిపిన నేతలు, ఆప్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని అంగన్ వాడి చిన్నారులతో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గడ్డలి పరిమళ రవీందర్ ఆనందం పంచుకున్నారు.

సోమవారం పట్టణంలోని 23వ వార్డులో తన జన్మదిన వేడుకలను ఆమె అంగన్ వాడి చిన్నారుల మద్య సాదాసీదాగా జరుపుకున్నారు. జన్మదినం సందర్భంగా చిన్నారులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్నిళ్లు పంపిణీ చేశారు. చిన్నారుల సమక్షంలో పరిమళ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు పరిమళకు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం పరిమళ మాట్లాడుతూ ప్రజలకు, పిల్లలకు సేవ చేయడమే నిజమైన సంబరాలు అని అన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలని అన్నారు. విద్య ఒక్కటే భవిష్యత్తుకు మంచి మార్గం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గడ్డలి రవీందర్, దర్మీది రవిందర్, అంగన్ వాడి టీచర్లు, ఆయాలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


