రేపు విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం

తాండూరు వికారాబాద్

రేపు విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం
– ప్ర‌క‌టించిన విద్యుత్ అధికారులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు మండ‌లంలో రేపు విద్యుత్ విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం విధిస్తున్న‌ట్లు డీఈ వెంక‌న్న‌ శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. పెద్దేముల్ మండ‌లంలోని మంబాపూర్, తొర్మామిడి, యాలాల మండ‌లం, తాండూరు మండ‌లంలోని గౌతాపూర్, చెంగోల్, ఎల్మ‌క‌న్నెతో పాటు తాండూరు మున్సిప‌ల్ ప‌రిధితో పాటు కోట్‌ప‌ల్లి, బంటారం మండ‌లాల్లో ఆదివారం ఉద‌యం 7గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేయ‌డం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. ఆయా ప్రాంతాల్లోని 132 కేవి విద్యుత్ లైన్‌ల నిర్వ‌హ‌ణ ప‌నుల‌ను దృష్టిలో ఉంచుకుని విధిస్తున్న‌ విద్యుత్ అంతరాయానికి వినియోగ‌దారులు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

కింది వ‌ర‌కు చూడండి…