ఇందిరమ్మ ఇంటి పనిలో ఘోరం

క్రైం తాండూరు రాజకీయం

ఇందిరమ్మ ఇంటి పనిలో ఘోరం
– విద్యుత్ షాక్ తో మహిళ మృతి
– యాలాల మండలంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇందిరమ్మ ఇంటి పనిలో ఘోరం జరిగింది. ఇంటికి నీళ్ళు పడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందింది.

ఈ సంఘటన యాలాల మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని రాస్నం గ్రామానికి చెందిన శశికళ(34) ఆదివారం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటికి నీళ్ళు పడుతుండగా ప్రమాద వశాత్తూ విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికి ఆమె మరణించింది. మృత దేహనికి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు యాలాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డికి జన నీరాజనం..!