పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డికి జన నీరాజనం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పట్లోళ నీరజాబాల్ రెడ్డికి జన నీరాజనం..!
– సాయిపూర్‌లో ప్రచారానికి బ్రహ్మరథం
– 12వ వార్డులో గెలుపుఖాయంటూ ఓటర్ల భరోసా
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ 12వ వార్డులో కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి ప్రచారానికి స్థానిక ప్రజలు నీరాజనాలు పలుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని నీరజాబాల్ రెడ్డి చేస్తున్న పర్యటనకు బ్రహ్మరథం పడుతున్నారు. స్థానిక ప్రజలు, మద్దతు దారుల అంచనాలకు ధీటుగా పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి ప్రచారంలో దూసుకపోతున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె తన మద్దతు దారులతో కలిసి విస్తృత పర్యటన చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఆమె ప్రచారానికి ఆదరణ తెలుపుతూ ఎన్నికల్లో మీదే గెలుపు ఖాయమని భరోసా అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నమ్ముకున్న ప్రజల కోసం సేవ చేయడమే తమ ధ్యేయమని అన్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యలు పరిష్కారంతో పాటు అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తుచేస్తున్నారు. ఈ సారి కూడా ఎన్నికల్లో గెలిపిస్తే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో 12వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అందరికి అందుబాటులో ఉంటానని, వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఎన్నిక్లలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, మహిళలు, యువకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…