అన్నదమ్ముల ఆత్మీయ కలయిక..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అన్నదమ్ముల ఆత్మీయ కలయిక..!
– శ్రీనన్న బర్త్‌ డేలో వెల్లివిరిసిన అనుబంధం
– తమ్ముడికి శుభాకాక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంకు చెందిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆయన సోదరులు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డిల ఆత్మీయ కలయిక అపురూప దృశ్యంగా నిలిచింది.

మంగళవారం జరిగిన ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలో అన్నదమ్ముల అనుబంధం వెల్లివిరిసింది. పట్టణంలోని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఆయన జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. జన్మదినం సందర్భంగా తమ్ముడు శ్రీనివాస్‌ రెడ్డిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శాలువా, పూలమాలతో సత్కరించారు. దగ్గరుండి కేక్‌ కట్ చేయించారు.

కేక్ తినిపించి జన్మదిన శుభాకంక్షాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి, మరో సోదరుడు సత్యానారయణరెడ్డిలు ముగ్గురు కలిసి ఆలింగం చేసుకుని అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ దృశ్యాలతో నేతలు, అభిమానులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఆస్తి పన్నుల వసూళ్లే టార్గెట్..!