బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలి
– వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
– పులుసు మామిడి బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అధికారులను ఆదేశించారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి దగ్గర జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయని ఆరా తీశారు. నిర్మాణ పనుల్లో ఇబ్బందులు, సమస్యలు ఏమైనా ఎదరువుతున్నాయా అని ఆరా తీశారు. బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేసి వీలైన త్వరగా బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చేవిధంగా చూడాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికార సిబ్బంది ఉన్నారు.
