సునీతమ్మ వెంట నడుస్తాం..!
– జెడ్పీ చైర్ పర్సన్ ను కలిసిన తాండూరు నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి వెంట నడుస్తామని తాండూరు నాయకులు అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం 13వ వార్డు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పల్లె జ్యోతి రవిగౌడ్, యాలాల మండలం నాగసముందర్ నాయకులు పద్మ, వెంకటయ్య తదితరులు కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. తాము మీ వెనకే నడుస్తామని, ఎంపీగా పోటీ చేస్తే మీ విజయానికి తిరుగుండదని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

