ఆర్బీఓఎల్‌ ఫ్యాక్టరీలో కొలాహలం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆర్బీఓఎల్‌ ఫ్యాక్టరీలో కొలాహలం..!
– అట్టహాసంగా శ్రీనివాస్ రెడ్డి జన్మదినం
– శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు, సిబ్బంది
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ఆర్బీఓఎల్‌ ఫ్యాక్టరీలో సీఈఓ, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

శ్రీనివాస్ రెడ్డి, ఎండీ బుయ్యని సరళా రెడ్డి దంపతులు ఫ్యాక్టరీ ఉద్యోగులు, సిబ్బంది మద్య జన్మదినం జరుపుకున్నారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డి దంపతులను ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా సన్మానించి.. శ్రీనివాస్‌ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తన ఎదుగుదలలో ఉద్యోగులు, సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఉద్యోగులు, సిబ్బందికి ఎల్లప్పుడు అండగా ఉంటానని తెలిపారు. మరోవైపు శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఉద్యోగులు, సిబ్బంది ఆకాంక్షించారు. ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీలో శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలతో కోలాహలం ఏర్పడింది.

పండగలా బుయ్యని శ్రీనన్న జన్మదినం