గులాబీ గెలుపు గుర్రాలు..!
– పార్టీలో పలువురి అభ్యర్థుల ఖరారు
– మాజీలకు, సీనీయార్టీకి ప్రాధాన్యం
– బీఆర్ఎస్ పార్టీలో పుర సందడి షురూ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌లో జరుగుతున్న ఎన్నికలకు గులాబీ పార్టీ పార్టీ గెలుపు గుర్రాలు రేసుకు సిద్దమయ్యారు. పురపోరులో పోటీ పడే అభ్యర్థులను ఖరారు చేశారు. పలువురు అభ్యర్థులకు టిక్కెట్లు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించారు. సాయిపూర్‌కు చెందిన సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలును చైర్మన్ అభ్యర్థిగా నిర్ణయించారు.

పట్లోళ్ల నర్సింలు గతంలో కౌన్సిలర్‌గా, డీపీసీ సభ్యులుగా పనిచేశారు. ఈసారి జరిగే ఎన్నికల్లో చైర్మన్‌గా స్వయంగా ఆయన పోటీకి సిద్దమయ్యారు. అదేవిధంగా ఆయన సతీమణి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పట్లోళ్ల దీపా నర్సింలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సాయిపూర్‌లోని 9వ వార్డు నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ కోడలు కోట్రిక నాగలక్ష్మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా రాజకీయ ఎంట్రి ఇవ్వబోతున్నారు. పట్టణంలోని 24వ వార్డు నుంచి పోటీకి దిగుతున్నారు. అదేవిధంగా మున్సిపల్‌లో హాట్రిక్ కౌన్సిలర్‌గా నిలిచిన బొబ్బిలి శోభారాణి సంజీవరావు పట్టణంలోని 15వ వార్డు నుంచి నాలుగోసారి పోటీ చేయబోతున్నారు.

పట్టణంలోని 16వ వార్డు నుంచి మాజీ కౌన్సిలర్ ఎర్రం వసంత మరోసారి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సీనీయర్ మాజీ కౌన్సిలర్ పరిమళ రవీందర్ పట్టణంలోని 23వ వార్డు నుంచి పోటీకి సిద్దమవుతున్నారు. మరో మున్సిపల్ సీనీయర్ కౌన్సిలర్ అనురాధ ఎన్నిక్లలో పోటీ చేయబోతున్నారు. పట్టణంలోని 28వ వార్డును ఆమెకు ఫిక్స్ చేశారు. తాండూరు మాజీ కౌన్సిలర్లు నరుకుల నరేందర్ గౌడ్, ఆయన సతీమణి సింధూజగౌడ్ లు మున్సిపల్ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా పట్టణంలోని 25వ వార్డు నుంచి యువ వ్యాపార వేత్త ఎజాబ్ కుటుంబం నుంచి ఒకరు పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. పట్టణంలోని 7వ వార్డు నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఈర్షాద్‌కు మరోసారి అవకాశం కల్పించనున్నారు. పట్టణంలోని 18వ వార్డు నుంచి యువ నాయకుడు సంజీవరావు పోటీ చేయబోతున్నారు. పట్టణంలోని 36వ వార్డు నుంచి రాము ముదిరాజ్‌కు బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించబోతోంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన బొంబీనా 19వ వార్డునుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు.

ఇదికూడా చదవండి…

