బీసీ వసతి గృహాల ప్రవేశాల గడువు పొడగింపు
– ఈనెల 30వ తేది వరకు ప్రవేశాలకు అవకాశం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశాలకు గడువు పొడగించినట్లు బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి పుష్పలత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరానికి గాను వికారాబాద్ జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి గృహాలలో (ప్రీమాట్రిక్), నూతన అడ్మిషన్ కొరకు గడువును ఈ నెల 30 -11-2021 వరకు పొడిగించటం జరిగిందని వెల్లడించారు. వసతిగృహాల్లో ప్రవేశాలకు ఆసక్తిగల విద్యార్థులు సంబ౦ధిత వసతి గృహ సంక్షేమ అధికారిని సంప్రదించాలని సూచించారు. అడ్మిషన్ ఫారాలను ఉచితంగా పొందవచ్చాన్నారు. అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, ఉచితంగా నోట్ బుక్స్, దుప్పటి , రగ్గు , మరియు కార్పెట్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. వసతిగృహాల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి రోజు ఉదయం అల్పాహారం, భోజనం నందు కోడి గుడ్డు, అరటి పండు, సాయంత్రం స్నాక్స్‌తో పాటు వారంలో ఒక రోజు చికెన్ వారికి ఆహారంగా అంధించబడుతుందని పేర్కొన్నారు. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.