ఓటర్లు మ్యాపింగ్ చేయించుకోవాలి
– రేపు రాజీవ్ కాలనీలో స్పెషల్ క్యాంపు
– మున్సిపల్ కౌన్సిలర్ జావిద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓటర్లు మ్యాపింగ్ చేయించుకోవాలని తాండూరు మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ సోమవారం వార్డులోని రాజీవ్ కాలనీలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ప్రభుత్వం ఎస్ఐఆర్(సర్) ద్వారా ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేస్తుందని తెలిపారు. 2002 సర్‌లో ఉన్న ఓటర్లు అందరు తమ వివరాలను మ్యాపింగ్ చేసుకోవాలన్నారు. పది రోజుల పాటు ప్రత్యేక శిబిరం కొనసాగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


