బకాయిలపై బల్దియా సీరీయస్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బకాయిలపై బల్దియా సీరీయస్..!
– తాండూరులో పలు దుకాణాల సీజ్
– చర్యలు చేపట్టిన కమీషనర్ మధుసూదన్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆస్తిపన్నుల బకాయిలపై తాండూరు బల్దియా సీరీయస్‌ అయ్యింది. పన్నులు చెల్లించని పలు దుకాణాలను సీజ్ చేసింది.

ఆర్థిక సంవత్సరంను దృష్టిలో ఉంచుకుని పన్నుల వసూళ్లపై మున్సిపల్ దృష్టిసారించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి, అధికారులు వసూళ్ల వేట చేపట్టారు. పట్టణంలోని పోట్లీ మహరాజ్ సమీపంలోని బకాయిలు ఉన్న దుకాణాలను సందర్శించారు. పన్నుల చెల్లింపుకు యజమానులు స్పందించక పోవడంతో వెంటనే దుకాణాలను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ఆస్తి పన్నుల బకాయిల విషయంలో ప్రజలు, యజమానులు సహకరించాలని కోరారు. లేదంటే ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కమీషనర్ వెంట మేనేజర్ నరేందర్ రెడ్డి, బిల్ కలెక్టర్లు, జవాన్లు, సిబ్బంది ఉన్నారు.

నిరంజన్ గౌడ్‌కు నివాళులు..!