రైతు సంక్షేమానికి సర్కారు కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

రైతు సంక్షేమానికి సర్కారు కృషి
– అన్నదాతల అభివృద్ధి కోసమే ప్రజా పాలన
– తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు
– మార్కెట్ యార్డులో 99రోజుల ప్రణాళిక కార్యక్రమం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు అన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశం బుధవారం తాండూరు మార్కెట్ కమిటి యార్డులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ పట్లోళ్ల నర్సింలు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రైతుల అభివృద్ధి కోసమే ప్రభుత్వం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.

రైతు బంధు, రైతు బీమాతో పాటు ప్రతి పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా తాండూరు మార్కెట్ కమిటి ఆధ్వర్యంలో రైతులకు మెరుగైన సేవలను అందిస్తుందని తెలిపారు. అంతేకాకుండా తాండూరు మార్కెట్ కమిటికి కొత్త భవనం మంజూరైందని, టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని చెప్పారు. రూ. 15 కోట్లతో దుకాణాల సముదాయాలు నిర్మించడం జరుగుతుందని, రైతుల కోసం ప్రత్యేకంగా గోదాలంను కూడా నిర్మించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో హమాలీ కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

అంతకుముందు మార్కెట్ కమిటి కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు బంధు ద్వారా రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. రైతు బీమా పథకం పై కూడా రైతులకు అవగాహన కల్పించారు. మార్కెట్ కమిటిలో అమల్లోకి తెచ్చిన ఈనామ్ 2.0 ద్వారా రైతులు ఆధార్‌ కార్డులు అందించి.. వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్‌గా మదికొండ నర్సిరెడ్డి, డైరెక్టర్లు ఎండీ అజ్మత్ అలీ, కె.జర్నప్ప, మహమ్మద్‌ ఖరీం, సూపర్ వైజర్ హబీబ్ అల్వీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ ట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు