రసాభసాగా గాజీపూర్ గ్రామసభ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రసాభసాగా గాజీపూర్ గ్రామసభ..!
– ప్రజా పాలనలో అధికారులను నిలదీసిన ప్రజలు
– పోలీసుల ప్రమేయంతో సద్దుముణిగిన వివాదం
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన గ్రామ సభ పెద్దేముల్ మండలం గాజీపూర్‌లో రసాభసాగా మారింది.

గ్రామంలో అర్హులకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదంటూ అధికారుపై మండిపడ్డారు. పరిణామాలు ఉద్రిక్తంగా మారడంతో అక్కడే ఉన్న పోలీసులు స్థానికులను అడ్డుకున్నారు. గురువారం గ్రామంలో ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ప్రజా పాలన పేరుతో ప్రజలను వమ్ము చేస్తూ సంబరాలు నిర్వహిస్తారా అని మండిపడ్డారు. ప సర్పంచ్ వార్డ్ మెంబర్ల ఆమోదం లేకుండా కేవలం గ్రామ సభ ద్వారా తీర్మానం ఎలా చేస్తారని మాజీ సర్పంచ్ తలారీ విరప్ప మండిపడ్డారు. పంచాయతీ కార్యదర్శి పై డిపిఓ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చెయ్యడంలో ప్రభుత్వం విఫలం అయిందని, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, మహిళలకు 2500రూపాయలు, ఉచిత విద్యుత్ అమలు కావడం లేదని అన్నారు. అర్హులైన పేదలు ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. గ్రామంలో ఎటువంటి అభివృద్ధి లేక కుంటుపడింది అని నిలదీశారు. అధికారులను నిలదీస్తున్న సమయంలో పరిస్థితి ఉద్రికత్తంగా మారింది. అక్కడే ఉన్న పోలీసులు ప్రజలను సముదాయించి సభ సహవుజ జరిగేలా చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డు సభ్యులు వివిధ శాఖల అధికారులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం