మీ సేవలకు బ్రేక్..!
– రెండు రోజుల పాటు సర్వీసులు బంద్
– అంతరాయానికి కారణం ఏంటంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో మీ సేవలలో సర్వీసులకు బ్రేక్ పడనుంది. రెండు రోజుల పాటు మీ సేవలలో సర్వీసులకు అంతరాయం కలగనుంది.

ఇందుకు గల కారణాలను నిర్వహకులు వెల్లడించారు. మీ సేవ వ్యవస్థలలో కొత్త సాప్ట్‌వేర్ అప్‌లోడ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ సాప్ట్‌వేర్ అప్‌లోడ్ చేసేందుకు 36గంటల సమయం పడుతుందని నిపుణులు తెలిపారు. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కోసం ఈ తాత్కాలిక అంతరాయం ఏర్పడుతుందని చెబుతున్నారు.

ఈ కారణంగా శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు సేవలలో బ్రేక్ పడుతుంది. ఈ రెండు రోజులు సెలవు దినాలు కావడం గమనార్హం. మీ సేవలలో కలుగుతున్న అంతరాయినికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇటీవలే మీ సేవలలో రేట్లను పెంచడం జరిగింది. వెంటనే కొత్త సాప్ట్‌వేర్ అప్‌లోడ్ పరిస్థితి ఏర్పడింది.


