
నారాయణ విద్యార్థులకు భరోసా..!
– ప్రైవేటు స్కూల్ అసోసియేషన్‌తో శ్రీనివాస్ రెడ్డి చర్చలు
– స్టూడెంట్స్ ఫీచర్ కోసం సూచనలు
– అసోసియేన్ స్పందన ఎంటంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : కార్పోరేట్ నారాయణ స్కూల్ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్బీఓల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి భరోసా అందించేందుకు కృషి చేస్తున్నారు. పట్టణంలోని నారాయణ స్కూల్లో 8,9,10వ తరగతులకు అనుమతులు లేకపోవడంతో విద్యార్థుల పైచదువులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేధనకు గురవుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేధనను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం తాండూరు పట్టణంలోని ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులతో శ్రీనివాస్ రెడ్డి చర్చలు జరిపారు. నారాయణ స్కూల్‌కు చెందిన 8,9,10వ తరగతుల విద్యార్థులను ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులకు చెందిన ఇతర స్కూళ్లలో చేర్చుకోవాలని అభిప్రాయాన్ని వారితో వ్యక్తం చేశారు.

ఇందుకు విద్యార్థుల నుంచి ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా చేర్చుకోవాలని కోరారు. ఇందుకు ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులు, యజమాన్యాలు సానుకూలంగా స్పందించారు. విద్యార్థులకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. మరోవైపు నారాయణ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీనివాస్ రెడ్డి భరోసా అందించేందుకు ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఇదికూడా చదవండి…

