అక్రమ నిర్మాణాలు, కట్టడాలను అడ్డుకోవాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

అక్రమ నిర్మాణాలు, కట్టడాలను అడ్డుకోవాలి
– పట్టణంలోని ప్రభుత్వ భూమిని కాపాడాలి
– ఆర్డీఓ, కమీషనర్‌లకు బీఆర్ఎస్ కౌన్సిలర్ల బృందం విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, కట్టడాలను అడ్డుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల బృందం కోరారు.

బుధవారం తాండూరు ఆర్డీఓ అనిత, మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డిలను కలిసి వినతిపత్రాలను అందజేశారు. పట్టణంలోని సర్వేనెంబర్ 111లో గొల్ల చెరువు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వారి దృష్టికి తెచ్చారు.

అనుమతుల్లేకుండా కొనసాగుతున్న కట్టడాలను అడ్డుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఈర్షాద్, జావిద్, యోగానంద్, అనిల్, నాయకులు సంతోష్‌ గౌడ్, రుద్రుపాటిల్, ఏజాజ్ తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్ పథకాల అమలుకు కృషి..!