అట్టహాసంగా పటేల్ కిరణ్‌ జన్మదినం

తాండూరు రాజకీయం వికారాబాద్

అట్టహాసంగా పటేల్ కిరణ్‌ జన్మదినం
– కేక్ కట్ చేయించిన బీఎస్ఆర్ దంపతులు
– శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు భావిగి భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి మాజీ చైర్మన్, ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, వీరశైవ సమాజం సభ్యులు పటేల్ కిరణ్‌ కుమార్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

శుక్రవారం రాత్రి తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డి దంపతులు పటేల్ కిరణ్‌ కుమార్‌ను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కేక్‌ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, ఉన్నత పదవులు చేపట్టాలని శ్రీనివాస్ రెడ్డి దంపతులు కిరణ్‌ కుమార్‌ను ఆశీర్వదించారు. అదేవిధంగా తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు కూడా శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, కౌన్సిలర్ బంటు వేణు, నాయకులు బాతుల నాగు, జోషి వికాస్, కోటం సిద్దలింగం, సందీప్ రెడ్డి, జోగుల ఎబినేజర్, దేవనూర్ శంకర్ తదితరులు కూడా పటేల్ కిరణ్‌ కుమార్‌ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం