ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని కలిసిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని తాండూరు టీఆర్ఎస్ నేతలు కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక లాంచనం కావడంపట్ల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం టీఆర్ఎస్ తాండూరు పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, నాయకులు మసూద్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, నాయకులు బీదర్ రాజశేఖర్, యువనాయకులు రొంపల్లి సంతోష్, మహేష్ తదితరులు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని కలిసి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మహేందర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
