బక్రీద్‌కు అన్ని ఏర్పాట్లు చేయండి

తాండూరు రాజకీయం వికారాబాద్

బక్రీద్‌కు అన్ని ఏర్పాట్లు చేయండి
– మసీదు, ఈద్గాల వద్ద మౌళిక సదుపాయాలు కల్పించాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ముస్లిం సోదరుల బక్రీద్ పండగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ముస్లిం పెద్దలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

పండుగ సందర్భంగా శాంతియుత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని చర్యలు తీసుకోవాలని అన్నారు. మసీద్లు, ఈద్గాల దగ్గర పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, నీటి సదుపాయాన్ని కల్పించాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, సీనీయర్ నాయకులు అబ్దుల్ రవూఫ్‌, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజ్, మాజీ అధ్యక్షులు హబీబ్ లాల, పోలీసు అధికారులు, కౌన్సిలర్లు, ముస్లిం మతపెద్దలు, యువ నాయకులు, పలు శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కడుపులో దూది మరిచి.. కుట్లు..!