కిలేడీ.. కరీమాభేగం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కిలేడీ.. కరీమాభేగం..!
– అప్పు ఇచ్చిన మరి కొందరిని హత మార్చే ప్లాన్
– డబుల్ మర్డర్‌ తర్వాత బయటకు వచ్చిన 6మంది బాధితులు
– దర్యాప్తును చేపడుతున్న పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళల డబుల్‌ మర్డర్ కేసులో నిందితురాలుగా ఉన్న కరీమాబీ భేగం గురించి అసలు నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

ఇప్పటికే తమకు అప్పు ఇచ్చిన అబేదాభేగం, మహబూబ్‌ బీ భేగంను రంగారెడ్డి జిల్లా మోయినాబాద్‌ తొల్కట్ట ఫాం హౌజ్ వద్దకు పిలిపించి హత్య చేసిన సంఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కరీమాభేగం మరికొందరిని ఇలాగే హత్య చేసేలా ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా కరీమాభేగంకు అప్పు ఇచ్చిన 6 మంది మహిళలు మీడియా ముందుకు వచ్చారు. వీరంతా ఇందిరానగర్‌, రాజీవ్ కాలనీకి చెందిన మహిళలు అని చెప్పుకొచ్చారు. కరీమాభేగంకు వడ్డీ, చేతు బదులుగా డబ్బులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. డబ్బులు ఇవ్వమని అడిగితే.. తమను కూడా ఆమె ఫాం హౌజ్ వద్దకు రమ్మని పిలించిందని చెప్పారు.

మేమూ కూడా వెళ్లి ఉంటే ఆమె చేతిలో హత్యకు గురయ్యే వారమని భయాందోళన వ్యక్తం చేశారు. కరీమాభేగం నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధిత మహిళలు పోలీసులను వేడుకున్నారు. తమ భర్తలకు తెలియకుండా కరీమాభేగంకు అప్పులు ఇచ్చామని తెలిపారు. ఇలా వరుస హత్యలకు కిలేడీ కరీమా భేగం ప్లాన్‌ చేసున్నట్లు బాధితుల ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు బాధిత మహిళలు అందించిన ఫిర్యాదుపై విచారణ జరిపి.. చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ ప్రవీణ్‌ కుమార్ రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యేగారు ఎంసీహెచ్‌పై దృష్టి సారించండి