నేడు, రేపు వర్షాలు

తాండూరు రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

నేడు, రేపు వర్షాలు
– ప్రకటించిన వాతావరణ శాఖ
– జిల్లాల జాబితా వెల్లడి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలోని పలు జిల్లాలలో నేడు, రేపు భారీ వర్షాలు పడున్నట్లు రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి మోస్తాలు వర్షాలు పడతాయని హెచ్చరించింది.

రాష్ట్రంలోని రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 40 నుంచి 50కి.మీ వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడొచ్చని పేర్కొంది.

ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు తెలిపిన వాతావరణ శాఖ అధికారులు.. కామారెడ్డిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అలాగే, బుధవారం వికారాబాద్, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కాంగ్రెస్ ఓటర్లపై కేంద్రం కక్ష్య