7 నెలల బాలుడికి మెటబాలిక్ డిజార్డర్
– చికిత్స సాయంకు తల్లిదండ్రుల ఎదురుచూపు
– దాతలు ఆదుకోవాలని వేడుకోలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : 7 నెలల బాలుడు మెటబాలిక్ డిజార్డర్ తో బాధపడుతున్నారు. చిన్నారి చికిత్స కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే… తాండూరు ప్రాంతానికి చెందిన మాధవి, సాయికుమార్ దంపతుల కుమారుడు ఉత్కర్ష్(7నెలలు) గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు.

ఆసుపత్రిలో చూపించగా బాలుడికి మెటబాలిక్ డిజార్డర్ ఉన్నట్లు తేలింది. బాలుడి వైద్యానికి ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు బాలుడికి చికిత్స చేయించడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బాలుడి చికిత్స కోసం దాతలు సహాకారం అందించాలని కోరుతున్నారు. ఎవరైనా సాయం అందించాలనుకుంటే బాలుడి తండ్రి సాయికుమార్ సెల్: 8106152638కు ఆన్ లైన్ ద్వారా సాయం అందించాలని కోరుతున్నారు. సాయం చేయాలనుకునే వారు కింద కోడ్ స్కాన్ చేయండి..

ఇది కూడా చదవండి….

