జయహో.. జై.. మనోహరన్న..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జయహో.. జై.. మనోహరన్న..!
– జనగామలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదినం
– టపాసులు పేల్చి.. స్వీట్లు పంచుకున్న నాయకులు
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : జయహో.. జై.. మనోహరన్న అంటూ పెద్దేముల్ మండలం జనగామ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

బుధవారం జనగామ గ్రామ పార్టీ యువ నాయకులు దొరోళ్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ అరుణ సమక్షంలో వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా కేక్‌లు తయారు చేయించారు. మనోహరన్న పాటలు, కేరింతల మద్య నేతలు కేక్‌ కట్ చేశారు. అంతకుముందు పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు.

కేక్‌ కట్ చేసిన అనంతరం ఒకరికొకరు తినిపించుకుని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో మండలాలు, గ్రామాల రూపురేఖలు మారుతాయని అన్నారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మరిన్ని పదవులు చేపట్టి.. ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సాయిని శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి, బీఎల్‌ఏలు శివ కుమార్, మల్లేశం, వార్డ్ మెంబర్ నర్సిములు, వడ్డే మల్లేశం, గడ్డం మల్లప్ప, సత్యనారాయణ, అనంత్ రెడ్డి, బుగ్గ రెడ్డి, అంతప్ప తదితరులు పాల్గొన్నారు.

తాండూరు అభివృద్ధికి కేరాఫ్‌గా బీఎంఆర్‌