23వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం..!
– మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పక్కా
– బీఆర్ఎస్ యువనాయకుడు పట్లోళ్ల సందీప్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 23వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఆ వార్డు ఇంచార్జ్, పార్టీ యువ నాయకుడు పట్లోళ్ల సందీప్ రెడ్డి అన్నారు.

సోమవారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. వార్డు ప్రజల అండదండలు, ఆదరణతో ఎన్నికల్లో గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో 23వ వార్డు నుంచి బీఆర్ఎస్ గెలుపు సాధిస్తామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మొదటి గెలుపు 23వ వార్డు నుంచే మొదలవుతుందని అన్నారు. ఎన్నికల్లో గెలిచి నమ్మిన వాళ్ల కోసం, వార్డు అభివృద్ధి కోసం శాయశక్తులా పనిచేస్తానని అన్నారు.

ఇదికూడా చదవండి…

