కోట్రిక నివాసంలో స్నేహితుల సందడి

తాండూరు రాజకీయం వికారాబాద్

కోట్రిక నివాసంలో స్నేహితుల సందడి
– ఉత్సహాంగా గడిపిన మాజీ చైర్ పర్సన్
– విద్య నేర్పిన గురువుకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య నివాసంలో ఆమె స్నేహితుల ఆత్మీయ సమ్మేళనం సందడిగా జరిగింది.

చిన్ననాటి నుంచి చదువుకున్న స్నేహితులు, విద్యనేర్పిన గురువు నాగయ్య గౌడ్‌లు శుక్రవారం ఆమె నివాసానికి వచ్చారు. కోట్రిక విజయలక్ష్మీ వారితో ఆత్మీయంగా పలకరించి ఆహ్వానించారు. బషీరాబాద్‌ మండలంలో చదువుకున్న నాటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు.

స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చేతులకు బ్యాండ్‌లు కట్టుకున్నారు. అనంతరం రిటైర్డ్ టీచర్ నాగయ్య సార్‌ను శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మీ మాట్లాడుతూ జీవితంలో ఎవ్వరు మరువలేనిది స్నేహం మాత్రమే అని అన్నారు.

ఇన్నాళ్లయినా కూడా స్నేహితులతో బందాన్ని కొనసాగించడం సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా విద్య నేర్పిన గురువును సన్మానించడం తన అదృష్టమని అన్నారు. రోజంతా స్నేహితులతో గడపడం జ్ఞాపకంగా మిగిలిందని అన్నారు.

స్కూళ్లకు కొత్త రూల్..!